JAISW News Telugu

Group-1 Posts : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 పోస్టుల పెంపు..

Good news for the unemployed

Good news for the unemployes

Group-1 Posts  : తెలంగాణ నిరుద్యోగులు గత పదేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కింద వేసిన నోటిఫికేషన్లు లీకేజీలు, రద్దు, వాయిదాలనే మిగిల్చాయి. లక్షలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి, భూములు అమ్ముకుని మరీ ప్రిపరేషన్ సాగించారు. వీరి సమస్యలను పట్టించుకుని బీఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాదు నిర్లక్ష్యంగా చూసింది. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లేసి ఆ పార్టీకి గెలుపునకు ప్రధాన కారణమయ్యారు. బీఆర్ఎస్ ను ఇంటికి పంపారు.

ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆమేరకు చర్యలు తీసుకుంటోంది. మొన్ననే కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. అతిత్వరలోనే గ్రూప్-1,2లకు సప్లిమెంటరీ నోటిఫికేషన్లు, మెగా డీఎస్సీ లాంటి పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ గ్రూప్-1 లో 60 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోని 503 పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టులు అవుతాయి. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇది గ్రూప్-1లో పెద్ద నోటిఫికేషన్ అవుతుందని చెప్పవచ్చు. వీటికోసం అతికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువరించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.

భర్తీ చేయనున్న పోస్టులు: 60

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 01
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్: 24
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ : 03
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ : 03
మండల పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ : 19
డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ : 02
డిప్యూటీ కలెక్టర్ : 03
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ : 04
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్స్) : 01

ఇదిలా ఉండగా.. ఈ ప్రకటనపై నిరుద్యోగుల్లో కొద్దిగా భిన్నస్వరాలు వినపడుతున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మరో ఏడాది దాక గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేరని, ఈ ఏడాది ఖాళీ అయ్యే అన్ని పోస్టులను భర్తీ చేయాలని అంటున్నారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో కనీసం 200 పోస్టులైనా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version