Team India : టీమిండియాకు గుడ్ న్యూస్.. వారిద్దరూ మళ్లీ వస్తున్నారు..

Good news for Team India..

Good news for Team India..

Team India : ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్- ఇంగ్లంగ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు ఆడుతున్నాయి. మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ అదరగొట్టగా, రెండో మ్యాచ్ లో భారత్ సత్తా చాటింది. ఇట టెస్టులు రసవత్తరంగా సాగుతుండడంతో రాబోయే వాటిపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈనెల 15 నుంచి రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే భారత్ జట్టను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. సిరీస్ ఆరంభానికి ముందు తొలి రెండు మ్యాచ్ లకు మాత్రమే జట్టును ప్రకటించింది.

మరోవైపు కీలక ఆటగాళ్లు బీసీసీఐ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలస్తోంది. కోహ్లీ ఆడకుండా ఉండడానికి స్పష్టమైన కారణం తెలియకున్నా.. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో దూరమయ్యాడనే కథనాలు వస్తున్నాయి.

అయితే తొలి టెస్ట్ లో గాయపడి వైజాగ్ టెస్ట్ కు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో వేగంగా కోలుకుంటున్నారు. దీంతో సీనియర్లు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారుగానే కనిపిస్తోంది. అలాగే రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులో చేరునున్నాడు.

మరోవైపు స్టార్ బౌలర్ బుమ్రా మూడు, నాలుగు టెస్టులకు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. సీనియర్లు అందుబాటులో ఉండడంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేగాక ఇతర పేసర్లు ప్రభావం చూపకపోవడమూ కారణమే. కాగా ఈ వారంలో ఇంగ్లండ్ తో చివరి మూడు టెస్టులకు టీమిండియా జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.

అయితే తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే..శ్రేయస్ అయ్యర్ కు కూడా గాయాలైనట్టు క్రీడావర్గాలు చెబుతున్నాయి. అతడు వెన్ను, గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నట్లు.. మిగిలిన మూడు టెస్టులకు దూరం కానున్నాడనే అంటున్నారు. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

TAGS