Tirumala News : శ్రీవారి భక్తులకు శుభవార్త: త్వరలో స్వామి వస్త్రాలు ఈ వేలం; ఎప్పుడంటే!!

Tirumala News

Tirumala News

Tirumala News : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధిం చిన అనేక విశేషాలను టీటీడీ ఎప్పటికప్పుడు స్వామి భక్తులకు అందిస్తుంది. ఇప్పటికే స్వామి వారికి మార్చిలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటిం చిన టీటీడీ, ఇతర కార్యక్రమాల వివరాలను వెల్లడి స్తుంది. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమ ర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లు ఈ వేలం వేస్తామ ని ప్రకటించిన టీటీడీ తాజాగా మరో శుభవార్త చెప్పింది.

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అను బంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పిం చిన వస్త్రాలను వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు స్వామివారి వస్త్రాలు ఈ – వేలం వేయనున్నట్టు పేర్కొంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలి అనుకునే వారు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వేలంలో పాల్గొని కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

ఇక ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమ ర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

TAGS