Tirumala Tirupati : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. తేదీలివే!

Tirumala Tirupati
Tirumala Tirupati : ఈ నెల 19న మే నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల కోసం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల (Arjitha Seva Tickets) కోటాను ఈ నెల 19న (సోమ వారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయను న్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకూ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.
అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అటు, తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్ లోని 5 కంపార్ట్ మెంట్స్ నిండాయి. శనివారం 71,021 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోందని.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో స్వామి దర్శన భాగ్యం లభిస్తోందని అధికారులు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం రూ.4.17 కోట్లు వచ్చినట్లు చెప్పారు.