Flight Passengers : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో నాలుగు ప్రాంతాలకు సర్వీసులు.. ప్రకటించిన అధికారులు..

Flight passengers

Flight passengers

Flight passengers : హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు విమాన ప్రయాణికులకు తీపి కబురు చెప్పారు. హైదరాబాద్ నుంచి కొన్ని ప్రాంతాలకు నాలుగు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విమాన ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి ఇతర దేశాలకు కాదని, కేవలం ఇండియాకు పరిమితమని ప్రకటించారు.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దక్షిణాదిన విశేష గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి దేశంలోని పలు మూలలతో పాటు ఇతర దేశాలకు విమానాలు వెళ్తుంటాయి. దాదాపుగా దక్షిణాదిన ఉన్న చాలా రాష్ట్రాలు ఈ ఎయిర్‌పోర్ట్ నే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు సర్వీసులను నడిపుతున్న అధికారులు కొత్తగా దేశంలోని నాలుగు ప్రాతాలకు సర్వీసులను విస్తరిస్తున్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అధికారులు శనివారం (నవంబర్ 18) రోజున అధికారికంగా వెల్లడించారు.

ఈ సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతోందని అధికారులు తెలిపారు. ఈ విమానయాన సంస్థ సహకారంతో దేశంలోని కొచ్చి, అమృత్ సర్, గ్వాలియర్, లక్నోలకు విమానాలను నడుపుతున్నారు. అయితే ఈ సేవలు శుక్రవారం (నవంబర్ 17) నుంచే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వీటిలో గ్వాలియర్ కు మాత్రం ఈ నెల 28 నుంచి విమానం కొనసాగుతుందని చెప్పారు.

దేశీయ టూరిజంను పెంపొందించేందుకు ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ సర్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశంతో పాటు కొచ్చి లాంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల నుంచి సర్వీసులు నడుస్తున్నా.. హైదరాబాద్ నుంచి మాత్రం రీసెంట్ ప్రారంభించారు.

TAGS