
AP Government
AP Government : ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది. కూటమి ప్రభుత్వం దానిని రూ.14 వేలకు పెంచింది. దానికి కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇవ్వనున్నట్లు సమాచారం.
‘అన్నదాత సుఖీభవ’ పథకం కోసం ప్రభుత్వం త్వరలో పోర్టల్ తీసుకురానుంది. అందులో రైతులు ధ్రువ పత్రాలను అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.