JAISW News Telugu

Free bus : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..వచ్చే నెల 15 నుంచే ఉచిత బస్సు ప్రయాణం

Free bus

Free bus

Free bus :  ఏపీలో టీడీపీ కూటమి ఎన్నికల హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ నిర్ణయంతో మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

జూన్ 4న ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకుంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ మంత్రి ఆగని సత్యప్రసాద్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ఆగని సత్యప్రసాద్ సోమవారం ట్వీట్ చేశారు. కర్ణాటకలో గతేడాది ప్రారంభించిన ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు మంచి సేవలందిస్తోంది. పేద, మధ్యతరగతి మహిళలు తమ సంపాదనలో అధిక మొత్తంలో ఉపాధి కోసం నిరంతరం వెచ్చించాల్సి వస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర పని ప్రదేశానికి వెళ్లేందుకు చెల్లించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం వారికి ఆదాయంలో కొంత మిగిలే వెసులుబాటు కల్పిస్తోంది.

కాగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తక్కువ ఖర్చుతో  ప్రభుత్వాలకు మంచి పేరు వస్తోంది. అలాగే ఓటర్లలో సగం ఉన్న మహిళా పథకం కావడంతో వారి నుంచి  సానుకూల దృక్పథం కనపడుతుండడంతో..భవిష్యత్ లో మరిన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావొచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కర్నాటక, తెలంగాణ మాదిరిగా తమకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి.

Exit mobile version