Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Gold Rates

Gold Rates

Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలు.. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి అలంకారం. అదే సమయంలో.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ ఎక్కువైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత.. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా 10-15 రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.74,390కి పడిపోయాయి. అక్టోబరు 23, 2024న బంగారం ధరలు తమ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.81,500ని నమోదు చేశాయి.

నేడు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 700 పెరిగింది. దీంతో తులం ఇప్పుడు రూ. 70,650 మార్కుకు చేరింది. దీనికి ముందు రోజు కూడా రూ. 600 ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి 10 గ్రాములకు ఇప్పుడు రూ. 77,070 వద్ద కొనసాగుతోంది. ఇది కూడా ముందటి రోజు రూ. 660 పెరిగింది. దీంతో 2 రోజుల్లో రూ. 1420 పెరిగిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే.. రూ. 700 పెరిగిన 22 క్యారెట్స్ పసిడి ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 70,800 కు చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి రేటు తులం రూ. 77,220 వద్ద ఉంది. మరోవైపు బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పుంజుకున్నాయి. కిలో వెండి ధర రూ. 2 వేలు పెరిగి ప్రస్తుతం రూ. 91,500 మార్కును తాకింది.

TAGS