Gold Man : వడ్డీ కాసుల వాడిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం. మనం కోరుకంటే ఆయన దర్శన భాగ్యం కల్పించడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే మనం చూసేందుకు వెళ్లాలి. అంతటి గొప్ప కలియుగ భగవంతుడు వైకుంఠవాసుడు, తిరుమలేషుడు, వేంకటేశ్వరుడు. స్వారి వారి దర్శనానికి రాష్ట్రమే కాదు.. దేశం కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భక్తులు తరలివస్తారు. అంతెందుకు ముస్లిం కంట్రీస్ నుంచి కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. పేద, ధనిక అని తేడా లేకుండా స్వామి వారి అనుగ్రహం అందరిపై సమానంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన ఉంచితే.. స్వామి వారి దర్శనానికి ముంబైకి చెందిన ఒక కుటుంబం రావడం ఆశ్చర్యాన్ని కలిగింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ముంబైకి చెందిన ఒక జంట కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చింది. అయితే వారి ఒంటినిండా కేజీల కొద్దీ బంగారం ఉంది. ఇద్దరు పురుషులు, ఒక మహిళ, బాలుడు దర్శనానికి వస్తే వారి వెంట దాదాపు 15 మంది వరకు సెక్యురిటీని తీసుకువచ్చారు. ఇక ఇద్దరి పురుషుల మెడలో కేజీల కొద్దీ బంగారం ఉంది. ఒక్కొక్కరూ 10 కిలోల చొప్పున ధరించారు. మహిళ ఆభరణాల రూపంలో 5 కిలోల చొప్పున ధరించింది. ఇంత బంగారాన్ని చూసిన క్యూలైన్, తిరుమలలోని స్థానిక భక్తులు వారితో సెల్ఫీలు తీసుకున్నారు.
భగవంతుడి వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి ఆర్భాటం లేకుండా రావాలి కానీ వారిని వారు ఎక్కువగా చూపించేందుకు అంత బంగారంతో రావడం సరైది కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అసలే వడ్డీకాసుల వాడు.. ఆయన వద్ద డాంబికాలకు పోతే మంచిది కాదు కదా.. అని భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా వీరిని చూసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపించడం కనిపించింది.