Viral Video : దేవుళ్లు అంటే అంత అభిమానం..ఎక్కడున్నా కొలవాల్సిందే
Viral Video : భారత సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.. హైందవ సంప్రదాయంలో దేవుడి పాత్ర ప్రధానమైనది. హిందూ మతంలో దేవుళ్లకు కొదువ లేదు. మూడు కోట్ల దేవతలు ఉన్నారని పెద్దలు అంటుంటారు. హిందూ మత వైభవమంతా గుడిలోనే ఉంది. పూర్వ కాలం నుంచి గుడి అంటే విద్యా, విజ్ఞానం, కళలు, సంస్కృతి, ఆచారం, ఆధ్యాత్మిక..ఇలా భారత దేశంలో లక్షలాది గుడులు ఉన్నాయి.
భారత్ లో పూర్వకాలం నుంచి పాలకులు ఆలయ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఏ నదిని చూసినా, ఏ కొండను చూసినా.. అక్కడ ఓ గుడి ఉంటుంది. లేకుంటే కనీసం ఓ దేవతా విగ్రహమైనా ఉంటుంది. అలాగే భారతీయ జీవన విధానంలో దేవతా పూజకు ప్రత్యేక స్థానం. అందుకే హిందువులు చెట్లు,పుట్టలు, జీవులను ఆరాధిస్తుంటారు. గంగానది ఒడ్డున పుణ్యక్షేత్రాలకు కొదువ లేదు. అలాగే హిమాలయ పర్వతాలు ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. దట్టమైన అడవులు కూడా పుణ్యక్షేత్రాలు నెలవులే. భారత్ లో రాయి, రప్ప, కొమ్మ, రెమ్మ కూడా దేవతారూపమే.
భారతీయుల దేవతారాధనను కొనియాడకుండా ఉండలేం. భారతీయులు ప్రాణాలకు తెగించి అమరనాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. అలాగే దట్టమైన అడవుల్లో, క్రూరమృగాల మధ్య నుంచి వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక నల్లమల అడవుల్లో దట్టమైన కొండలు, గుహలు, నదులు దాటుకుంటూ నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరంలో ఈశ్వరుడిని దర్శించుకుంటారు. ఇలా దేవుడు ఎక్కడున్నా భారతీయులు ప్రాణాలకు తెగించి దర్శించుకుంటారు.
ఇలాంటిదే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఏ ప్రాంతం అనేది తెలియదు. కానీ ఓ భక్తుడు కొండల్లో నెలవైన శివుడిని దర్శించుకునేందుకు ఎంతో కష్టపడి ఆ కొండలను ఎక్కుతాడు.అక్కడ ఓ దీపం వెలుగుతూ ఉంటుంది. దాన్ని మొక్కి అక్కడి దైవాన్ని ప్రణమిల్లుతాడు. మీరు కూడా ఆ వీడియో చూడండి భక్తపారవశ్యంతో పొంగిపోతారు.