Bhadrachalam : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు 50.9 అడుగులకు నీటి మట్టం చేరింది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటలకు నీటి మట్టం 48 అడుగులు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
దుమ్ము గూడెం, పర్ణశాల వద్ద గోదావరి నదీ నీటి మట్టం దాదాపు 25.8 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం, దుమ్ము గూడెం మధ్య రాకపోకలు నలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డు పైకి గోదావరి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇళ్లలోకి వరద నీరు చేరింది.