Go 512 : ఏపీ భూహక్కుల చట్టం ఏపీలో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇది 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.512 జారీ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా భూయజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ రూపొందిస్తారు. దీంతో స్థిరాస్తిని భూయజమాని తప్ప మరొకరు విక్రయించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చట్టంలో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులకు శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అధికారి మండల స్థాయిలో ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు.
ఇకపై భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ఈ ల్యాండ్ టైట్లింగ్ అధికారులకు మాత్రమే ఉంటుంది పలు దశల తర్వాత భూ యజమానులను శాశ్వత హక్కుదారులుగా టైట్లింగ్ అధికారి గుర్తిస్తారు. అనంతరం రిజిస్టర్ లో వారి వివరాలు నమోదు చేస్తారు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చు.
కాగా, ప్రభుత్వం ఈ చట్టంతో భూహక్కుదారులకు మేలు జరుగుతుందని చెబుతున్నా దీంతో తీవ్ర నష్టమని మేధావులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. 512 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల చిన్న, సన్నకారు రైతులకు నష్టం కలిగించే విధంగా ఈ జీవోను తీసుకొచ్చిందని అంటున్నారు. దీనివల్ల పేద రైతులను తీరని నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే న్యాయస్థానాలకు ఉన్న అధికారాన్ని రెవెన్యూ కట్టబెట్టడంతో పేదలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. భూస్వాములు, కబ్జాకోరులు ఈ చట్టంతో తమ పలుకుబడిని ఉపయోగించుకుని పేదల భూములను స్వాధీనం చేసుకుంటారన్నారు. అలాగే భూక్రయవిక్రయాల,రిజిస్ట్రేషన్లు