Rajinikant : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “వేట్టయన్”.@ కూలీ. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, దుషార విజయన్ తదితరులు నటించారు. ఈ నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానున్నది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జై భీమ్ సినిమా తనకెంతో నచ్చిందని, వెంటనే జ్ఞానవేల్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని రజినీకాంత్ వెల్లడించారు. కానీ అతనితో మాట్లాడే అవకాశం రాలేదని పేర్కొన్నాడు. ‘వేట్టయన్’ కథ వినమని తన సౌందర్య చెప్పడంతో చెప్పడంతో విన్నానని, చాలా బాగుందనిపించిందన్నారు. ఈ సినిమాకు చాలా డబ్బు ఖర్చవుతుందని, కథలో కొన్ని కమర్షియల్ హంగులు జత చేయాలని కోరినట్లు చెప్పాడు రజినీకాంత్. దర్శకుడు పది రోజుల సమయం అడిగాడని, ‘కమర్షియల్ సినిమాగా మారుస్తానని చెప్పాడన్నారు. కానీ ఓ కండీషన్ అనడంతో షాక్ అయ్యానని చెప్పాడు. తాను కొందరి దర్శకుల్లా సినిమాను కమర్షియల్ గా మార్చలేనని, నా శైలిలో ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను మారుస్తానని అని జ్ఞానవేల్ చెప్పాడన్నారు. ‘నాక్కూడా అదే కావాలి.. లేదంటే లోకేశ్, దిలీప్ లతో నే సినిమా చేసేవాడిని కదా అని చెప్పారు10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడని, అప్పడు విన్నాక మరింత ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్. సంగీత దర్శకుడిగా అనిరుధ్ మాత్రమే కావాలని జ్ఞానవేల్ పట్టుపట్టాడని చెప్పుకొచ్చారు రజనీ. తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంతో జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కించారు. రజనీకాంత్‌కు ఇది 170వ సినిమా. ఇందులో రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ గా నటించాడు రజినీ.