JAISW News Telugu

Thug Life గ్లింప్స్ : కమల్-మణిరత్నం కాంబోలో ‘థగ్ లైఫ్’..

FacebookXLinkedinWhatsapp

Thug Life : కమల్ హాసన్ – మణిరత్నం కాంబో1990 దశకంలో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రాబోతోంది. 37 ఏళ్ల క్రితం వచ్చిన ‘నాయకుడు’ తర్వాత వీరు మళ్లీ ఈ ధ్వయంలో ‘థగ్ లైఫ్’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ కాంబినేషన్ పై బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు భారీ అంచనాలు ఉన్నాయి. శింబు కూడా ఈ సినిమాలో కనిపించడం విశేషం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరో లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఎప్పటి నుంచో సస్పెన్స్ గా ఉంది.

ఎన్నో ఊహాగానాలు వినిపించాయి కానీ ఈ రోజు కమల్ హాసన్ పుట్టిన రోజును పురస్కరించుకొని మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ టీజర్ లో లెజెండరీ నటుడి డిఫరెంట్ గెటప్స్, ఎస్.టి.ఆర్ గ్లింప్స్ తో స్టైలిష్ గా, సొగసైన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. మణిరత్నం మేకింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ పొయెటిక్ అండర్ టోన్ తో కనువిందు చేసే విజువల్స్ ను సెట్ చేయడంలో లెజెండరీ డైరెక్టర్ దిట్ట అని, తాజాగా వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ ఒక ఉదాహరణ అని అన్నారు.

గ్లింప్స్ లోని విజువల్స్ మాస్టర్ ఆర్టిస్ట్ నుంచి మరోసారి టాప్ క్లాస్ విజువల్ ఫీస్ట్ ను అందిస్తాయి. ఈ ఎపిక్ మూవీ 2025, జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మణిరత్నం, కమల్ ఫ్యా్న్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాను వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మణిరత్నం చెప్తున్నారు.

Thug Life Release Date Teaser (Telugu) | Kamal Haasan | Mani Ratnam | STR | AR Rahman | RKFI| MT |RG

Exit mobile version