Glenn Maxwell : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆర్సీబీ తన ఫేలవ ఫామ్ ను కొనసాగిస్తూనే ఉంది. వాంఖేడే లో ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో జరిగిన మ్యాచ్ లో 196 పరుగుల భారీ స్కోర్ చేసినా ఫేలవ బౌలింగ్ తో ముంబయి పై చిత్తు చిత్తుగా ఓడిపోయి అభిమానులను నిరాశ పర్చింది. ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం ఒక దాంట్లోనే గెలిచి ఫ్లే ఆప్ రేసును సంక్లిష్టం చేసుకుంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి ఒక్కడే ఫామ్ లో ఉండడం, బౌలింగ్ లో ఎవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ టీం మునుపటి ప్రదర్శన కనబర్చలేకపోతుంది.
ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఫాప్ డుఫ్లెసిస్, రజత్ పటిదార్,, దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీలు చేసి 196 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. కానీ ఆర్సీబీ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చెలరేగి ఆడటంతో ముంబయి ఇండియన్స్ 15.3 ఓవర్లలోనే భారీ టార్గెట్ ను చేజ్ చేసింది.
దీంతో కెప్టెన్ డుప్లెసిస్ నిరాశ చెందాడు. మేం స్కోరు బోర్డుపై 250 పరుగులు చేయాలేమో అని నిట్టూర్చాడు. ఫామ్ లో లేని మ్యాక్స్ వెల్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతడు మిగతా మ్యాచ్ లకు అందుబాటు లో ఉంటాడో లేడో చెప్పలేని పరిస్థితి. మ్యాక్స్ వెల్ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చ లేదు. తక్కువ స్కోర్లకే అవుటై ఆర్సీబీ జట్టుకు భారంగా మారాడు. అయితే మ్యాక్సీ ఉన్నా లేకున్నా జట్టుకు వచ్చే లాభమేమీ లేదని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే రాయల్ చాలెంజర్ బెంగళూరు నెక్ట్స్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఇప్పటికే భీకర ఫామ్ లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లు తేలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్సీబీ భారం మొత్తం విరాట్ కొహ్లీ మీదనే ఉంది. విరాట్ విఫలమైతే ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయినట్లే.