Glass Symbol : గాజు గ్లాసు.. హైకోర్టులో జనసేన పిటీషన్

Glass Symbol
Glass Symbol : సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ‘గాజు గ్లాసు’ గుర్తు టెన్షన్ పెడుతోంది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది. తమకు కేటాయించిన ఈ గుర్తును ఇతరులకు కేటాయించ వద్దంటూ పిజిషన్ లో కోరారు.
ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం అందజేశామని జనసేన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి వినతిపత్రం ఇచ్చినా కూడా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్న కారణంగా ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే కూటమికి నష్టం వస్తుందని అన్నారు.
మరోవైపు జనసేన పార్టీ ఇచ్చిన అభ్యర్థనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది