JAISW News Telugu

Glass Symbol : కూటమిలో ‘గాజు గ్లాసు’ ఫీవర్.. ఏం చేస్తుందో ఏమో

Glass Symbol

Glass Symbol

Glass Symbol : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఏర్పడింది. గాజు గ్లాస్ గుర్తు స్వతంత్రులకు కూడా కేటాయించడం కూటమిలో టెన్షన్ పెంచుతోంది. దీనిపై జనసేన కోర్టును ఆశ్రయించింది.

దీనిపై కోర్టు కొంతమేర న్యాయం చేసినా పూర్తిస్థాయిలో మేలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం, కాకినాడ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇక్కడ మాత్రం గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు ఇవ్వడం లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గాజు గ్లాస్ గుర్తు ఇతరులకే కేటాయించేందుకు రెడీ అవుతోంది. దీంతో జనసేనలో ఆందోళన మొదలైంది.

టీడీపీ కూటమికి ఇది ప్రతిబంధకంగానే మారనుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయని భయం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లు చీలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. కూటమికి ఇది పెద్ద దెబ్బగానే చెబుతున్నారు. దీంతో ఈ ఎన్నికలు జనసేనకు మైనస్ గానే నిలిచే ప్రమాదముందని తెలుస్తోంది.

గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది అంటూ పవన్ ఇస్తున్న కౌంటర్ కు గాజు గ్లాస్ రెండు వైపులా పదును ఉంటుందని ఈసీ నిరూపించింది. గాజు గ్లాస్ ఓట్లు చీలుస్తుందో లేదో తెలియదు కానీ కూటమిని మాత్రం తెగ భయపెడుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు ఈ భయం నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఫలితాలు ఎలా ఉంటాయోననే బెంగ మాత్రం వారిని వేధిస్తోంది.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇంతటి దారుణానికి కారణంగా నిలుస్తోంది. గాజు గ్లాస్ ను ఇతరులకు కేటాయించకుండా ఉంటే సరిపోయేది. కానీ స్వతంత్రులకు కేటాయించడంతో వారి ఓట్లు పోతాయనే ఫోబియా వారిని వెంటాడుతోంది.

Exit mobile version