Former CM KCR : వారం రోజుల గడువు ఇవ్వండి – ఈసీని కోరిన మాజీ సీఎం కేసీఆర్

Former CM KCR
Former CM KCR : ఈసీ నోటీసులపై తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కెసిఆర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కావాలని ఆయన కోరారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ ఇటీవల నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల పర్యటనలో తమ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రిన ఈరోజు ఉదయం 11 గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి పాటించాలన 2019లో, 2023లోనూ కేసీఆర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది. నిరాధార ఆరోపణలు, దుర్భాషలు, ప్రత్యర్థుల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని, ఎన్నికల వాతావరణ దెబ్బ తింటుందని ఈసీ తెలిపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై తాజాగా స్పందించిన కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు.