JAISW News Telugu

Boyfriend suicide : ప్రియురాలి బంధువులు కొట్టారని.. ప్రియుడి ఆత్మహత్య

Boyfriend suicide : ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు దాడిచేసి కొట్టడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మలపహాడ్ కు చెందిన రంజిత్ పుల్కల్(20) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ఆ యువతి పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని తీవ్రంగా కొట్టారు. అవమానంగా భావించిన రంజిత్ మనస్తాపంతో సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version