Manchu Family Trolls : టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లో లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో టాక్ లిస్ట్ లో ఉండేది మంచు లక్ష్మి. అవునండి మీరు విన్నది నిజమే మంచు లక్ష్మి యూఎస్ యాడ్స్ లో నటించింది. కొన్ని యాడ్స్ కు డైరెక్టర్ గా కూడా పని చేసింది. ప్రొడ్యూసర్ గా కూడా పని చేసింది. చాలా రంగాల్లో ఆమె ప్రతిభ చూపింది.
ఇంత క్రెడిట్ సంపాదించినా పాపం ఎప్పుడూ ట్రోల్స్ కు గురవుతూనే ఉంటుంది. ఆమె లాంగ్వేజ్ యాక్సంట్, బాడీ బిహేవియర్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య పాపం ఆమె కుటుంబం కూడా ట్రోల్స్ కు గురైంది. మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ నేపథ్యంలో కుటుంబంలో తీవ్ర అలజడి రేగింది. ఫ్యామిలీ మొత్తం ట్రోల్స్ కు గురైంది. దీనిపై మొదటి సారి మంచు లక్ష్మి స్పందించింది.
హైదరాబాద్ లో జరిగిన ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తను మాట్లాడింది.. తన కుటుంబం సోషల్ మీడియాలో ఎప్పడూ ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది. ‘ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుండా మనం బతకడం కష్టంగా మారింది. టెలివిజన్ ఉన్న సమయంలో కెరీర్ ప్రారంభించిన నేను సోషల్ మీడియా రావడంతో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నా. ఇది ముందు నన్ను చాలా బాధించింది.
సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను ఎంతగానో అభిమానిస్తారని, నన్ను ఎంతో ప్రశంసిస్తారని అనుకున్నా. కానీ ప్రజలు నాపై ఇంత కఠినంగా వ్యవహరిస్తారని నేను ఊహించలేదు. నేను గానీ, నా కుటుంబం గానీ రాజకీయం చేయలేం, మా మనసులోని మాటను మాట్లాడతాం, విషయాలను యథాతథంగా మాట్లాడతాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. చివరికి నా గురించే మాట్లాడుతున్నారు, అదే ముఖ్యం.’
తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, బంగ్లా, మరాఠీ సహా వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని టీమ్ భావిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఈ చిత్రం విడుదల తేదీని జూన్ 14గా నిర్ణయించారు. ఈ వెబ్ సిరీస్ కు తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు.