Ayodhya Celebrations : అయోధ్యకు చేరుకున్న అత్తింటి కానుకలు.. సంబరాలు..
Ayodhya Celebrations : అల్లుడు ఇళ్లు కట్టుకుంటే అత్తింటి వారు సంభారాలు.. కానుకలు పెట్టడం ఆనవాయితీ. అది పిల్లను ఇచ్చిన అల్లుడైనా.. మేనల్లుడికైనా వర్తిస్తుంది. జగదభి రాముడి పట్టాభిషేకం సందర్భంగా ఈ ఆచారాన్ని శ్రీరామ తీర్థ ట్రస్ట్ పాటిస్తుంది.
అయోధ్య రాయుడి దివ్య, భవ్య ఆలయం 495 సంవత్సరాల తర్వాత నిర్మాణం జరుగుతుంది. అంటే ఇంటిలోకి జనవరి 22వ తేదీన రాముడు సతీ సమేతంగా గృహ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సందర్భంగా అమ్మమ్మ గారి ఇంటి నుంచి కానుకలు సంభారాలు అందుతాయి.
* శ్రీరాముడి అమ్మమ్మ గారి ఇళ్లు ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయపూర్, కౌసల్యా దేవి తల్లి గారి ఊరు దే. మేనమామలు అందరూ కలిసి సంభారాలు తీసుకొచ్చారు ఇలా తేవడాన్ని వాళ్లు ‘మాయిరా’ అంటారు.
* 2 ట్రక్కుల నిండుగా శ్రీరాముల వారి అత్త గారి ఊరు మిథిలానగరం.. నేపాల్ లోని జనక్పూర్, అక్కడి నుంచి తమ ఆడపడుచుకు, తమ కూతురుగా భావించే సీతమ్మ తల్లికి, ప్రేమగా పిలిచే ‘కిశోరీ’కి, ఆభరణాలు, సంభారాలు, సారె, కొత్త బట్టలు, పండ్ల బుట్టలు తీసుకచ్చి సమర్పించుకున్నారు. ఈ ఆచారాన్ని నేపాళీయులు ‘భార్’ అని పిలుస్తారు.
* కోర్టులో కూడా బాలరాముడి ప్రతినిధి శ్రీచంపత్ రాయ్ కి అందించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని ఆనందపడుతూ, తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో జనక్పూర్ జానకి మాత ఆలయం ప్రధాన పూజారి ఒక మాట చెప్పాడు.
* త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణ భరత శతృజ్ఞులకు – సీతమ్మ తల్లి, ఊర్మిళాదేవి, మండవి, శృతకీర్తిలను ఇచ్చి వివాహం చేసి సంభారాలతో సాగనంపాము.. ఆయనకు ఇచ్చిన భూములు ఆయనకు ఇచ్చిన కట్నాలు అన్నింటినీ ప్రతి ఏటా సరి చూసి అయోధ్యలో ఇచ్చుకుంటూనే ఉంటాము. కలియుగంలో ఇప్పుడు కూడా ఈ ఆనవాయితీని పాటించినట్లు చెప్పారు.
* అత్తారింటికి వెళ్లిన ఆడ బిడ్డను అత్తింటి వాళ్లను ఉద్దేశించి ఎత్తిపొడుపులతో.. హాస్యరసమైన పాటలు పాడుతూ కవ్విస్తుంటారు వీటిని ‘గారి’ అంటారు. మిథిలా వాసుల హాస్యపు పాటలు, చేష్టలు చూసి తీరవలసిందే.
* 70 నుంచి 80 ఏళ్ల వృద్ధులు కూడా రాముడిని బావగా భావించి విచిత్రమైన విన్యాసాలతో ఆడుతూ పాడుతూ కవ్విస్తుండే మాటలు మాట్లాడడం అక్కడి సంప్రదాయం అంత మాత్రమే కాదు దేశం అంతటా ఈ పద్ధతి ఉంకా ఉండనే ఉంది.