YSRCP:ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు చక చకా పావులు కదుపుతున్నాయి. వీటితో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఏపీపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఎన్నికల కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించిన చంద్రబాబు సరికొత్త ఎత్తులతో ఎన్నికల బరిలోకి దిగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన, తాము కలిసి పోటీ చేస్తామని, ఇద్దరి మధ్య పొత్తు ఉంటుందని స్ఫస్టం చేశారు.
మరో వైపు అధికార పార్టీ వైఎస్సార్ సీపీ కూడా పావులు కదుపుతూ గెలుపు గుర్రాలకే ఈ సారి సీట్లు అంటూ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. పలు నియోజక వర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను తప్పించి మార్పులకు శ్రీకారం చుట్టామని సంకేతాల్ని అందించింది. అయితే ఆ పార్టీకి తాజాగా గిద్దలూరులో షాక్ తగిలింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ దఫా ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి షాక్ ఇచ్చాడు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనంటూ తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనారోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, అయినా సరే పార్టీలోనే కొనసాగుతానని స్పష్ం చేశారు. అయితే తాజా వార్తల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఆయన స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, అనారోగ్య కారణాల దృష్ట్యా పోటీ చేయడం లేదన్నారు.