India – New Jersey : విదేశాలలో ఉన్న తమ వారికి ఏదైనా పంపించాలంటే కొరియర్ సేవలు వినియోగిస్తాం. కానీ కొన్నింటిని పంపించేందుకు వీలు కాదు. అలాంటి సమయంలో ఎవరైనా ఇండియా వస్తేనో.. లేదంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తేనో వారితో పంపిస్తాం. అందరూ తీసుకెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపరు. కానీ కొందరు సేవా గుణంతో తీసుకెళ్తాం అంటారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి.
జూలై 1వ తేదీన జయప్రకాశ్ పుట్లూరి అమెరికాలోని న్యూ జెర్సీకి వెళ్తున్నాడు. ఊరికే వెళ్లకుండా ఏవైనా ముఖ్యమైన మందులు, లేదంటే ముఖ్యమైన పత్రాలు ఉంటే తనకు ఇస్తే న్యూ జెర్సీలోని ప్రవాసీయులకు అందజేస్తామని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని వాట్సప్ గ్రూపులో పెట్టారు. దీనికి సంబంధించి ఆయన ఇండియా మొబైల్ నెంబర్ (8008202070) కూడా ఇచ్చారు.
ఎవరైనా వారి కుటుంబ సభ్యులు, బంధువులు న్యూ జెర్సీలో ఉన్నట్లయితే తనను కాంట్రాక్ట్ చేసి ముఖ్యమైన థింగ్స్ ఇస్తే అక్కడికి తీసుకెళ్లి వారికి అందజేస్తానని ఆయన చెప్పారు. ఆయన దాతృత్వ హృదయానికి అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు.
ఇలాంటి సేవలు ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దూర దేశంలో వేలాది కిలో మీటర్లు, సముద్రాల అవతల ఉన్న తమ వారికి ఏదైనా పంపించాలంటే భారతీయులకు కష్టతరం అవుతుంది. అలాంటి వారికి ఈ సేవ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవ భారత ఖండాలకు విస్తరించాలి. అందుకు ‘జేఎస్‌డబ్ల్యూ’ నడుం బిగిస్తోంది.
విదేశాల (ఏ దేశం) నుంచి వచ్చి వారు తిరిగి వెళ్లేప్పుడు ఇలాంటి సమాచారాన్ని ‘జేఎస్‌డబ్ల్యూ’కు అందజేస్తే తమ మీడియా గ్రూపుల ద్వారా ప్రచారం చేసి అందరికీ ఉపయోగపడేలా సాయం చేస్తాం అంటూ హామీ ఇస్తుంది ‘జేఎస్‌డబ్ల్యూ’. అందుకు అందరూ ‘జేఎస్‌డబ్ల్యూ’కు మెయిల్ ద్వారా గానీ మరే ఇతర మార్గాల ద్వారాగాని సమాచారం ఇస్తే భారతీయులకు హెల్ప్ అవుతుంది.