German visas : నైపుణ్యం కలిగిన భారత శ్రామిక శక్తి కోసం వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయించింది. ఈ సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచిందని ప్రధాని మోదీ తాజాగా వెల్లడించారు. 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ లో ప్రధాని మాట్లాడుతూ.. రాబోయే 25 ఏళ్లకు వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామని ఈ సందర్భంగా తెలిపారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ భారత్ కు వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమావేశం నిర్వహించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతూన్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు.