Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి’ ఆకట్టుకుందా?

Geethanjali Malli Vachindhi

Geethanjali Malli Vachindhi

Geethanjali Malli Vachindhi : గీతాంజలి సినిమా లో అంజలి యాక్షన్, శ్రీనివాస్ రెడ్డి ఇన్నోసెంట్ క్యారెక్టరైజేషన్ తో అదరగొట్టడంతో 2014లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ ఉన్న ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. అయితే ఆ తర్వాత అలాంటి హర్రర్ మూవీస్ వచ్చినా కామెడీ డోస్ లేకపోవడం కథ బలంగా లేకపోవడంతో ఆడలేవు. కోన వెంకట్ గురించి సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. రచయిత అయిన ఆయన నిర్మాతగా గీతాంజలి మళ్లీ వచ్చిందని పదేళ్ల తర్వాత సీక్వెల్ ప్లాన్ చేశాడు.

స్టోరీలోకి వెళితే ఎప్పటిలాగే పాత మహాల్ లో ఒక ఫ్యామిలీ ఆత్మల రూపంలో ఉండడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. సినిమాలో డైరెక్టర్ గా నటించిన శ్రీనివాస్ రెడ్డి వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు ఓ నిర్మాత నుంచి కాల్ వచ్చి సినిమా చేయాలని కోరడంతో అతడి స్నేహితులైన సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య తో కలిసి ఊటీ వెళతారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది. ఆత్మల రూపంలో ఉన్నది ఎవరూ.. వీరు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. గీతాంజలి పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

హర్రర్ అండ్ కామెడీ సినిమాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది కాంచన మూవీనే. లారెన్స్ ఆ సినిమా ద్వారా సగటు సినీ ప్రేక్షకుడిని హర్రర్ మూవీలకు కూడా థియేటర్లకు తీసుకురావచ్చని నిరూపించారు. అలాంటి సమయంలో 2014 లో  తెలుగులో గీతాంజలి సినిమా రావడం కూడా పెద్ద ప్లస్ అయింది. అదే కోవలో కాస్త క్రియేటివిటీని జోడించి గీతాంజలి మళ్లీ వచ్చిందిని తెరకెక్కించారు. దెయ్యాలతో మనుషులు మాట్లాడగలిగితే  ఎలా ఉంటుందనే విషయంలో దాన్ని హస్య సన్నివేశాల మాదిరిగా చిత్రీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.

అన్నా బెల్, కాంచన, ఓం బీం బుష్ లాగా ఇప్పటి తరహా జనరేషన్ ను ఆకట్టుకునేలా కథనం లేకపోవడం మైనస్. స్క్రీన్ ప్లే కాస్త రోటీన్ గా అనిపిస్తుంది. ఇంతమంది స్టార్ కమెడియన్లతో ఎక్కువ నవ్వులను జనాలు ఆశిస్తారు. కానీ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ గా తీశారు. ఎంటర్ టైన్ మెంటు ఉన్నా.. ఇంకా పెరిగితే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం మనం అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఉండదు. ఓవరాల్ గా చూస్తే గీతాంజలి కంటే గీతాంజలి మళ్లీ వచ్చింది లో కొత్తదనం ఎక్కువగా కనిపించదు.

TAGS