Geetam University : గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

Geetam University
Geetam University : గీతం యూనివర్సిటీ విద్యార్థిని శుక్రవారం హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. బీటెక్ సీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వర్ష (19) హాస్టల్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి వర్ష అనంతపురం జిల్లాకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.