Telangana:తెలంగాణ ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసి కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. దీంతో ఎన్నికల కమీషన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడవ శాసన సభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు.అంతే కాకుండా ఎన్నికలపై నివేదికను కూడా సమర్పించారు.
గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈఓ వికాస్ రాజ్ గమర్నర్‌కు అందజేశారు. మరో వైపు ప్రస్తుత శాసన సభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సర్య్కూలర్ జారీ చేశారు. ప్రస్తుత శాసన సభను రద్దు చేస్తూ కాసేపటి క్రితమే అసెంబ్లీ రద్దు పత్రాలను గవర్నర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నరసింహా చారి అందజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఈ రాత్రికే కొలువుదీరనుంది. రాత్రి 8ఫ30 గంటలకు నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం కాన్వాన్‌ని సిద్ధం చేశారు. అంతే కాకుండా కొత్త మంత్రుల కోసం అధికారుల వాహనాలను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు దిల్ కుష అతిథి గృహానికి వాహనాలు తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి అనుగునంగా సచివాలయంలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికారుల పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను ఖాలీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.