JAISW News Telugu

Gautham Gambhir : విరాట్ కోహ్లీతో వివాదాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతం గంభీర్

Gautham Gambhir

Gautham Gambhir

Gautham Gambhir : గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టు ఎంపికలో తన మార్క్ చూపెట్టారు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. జట్టులో వీరు కొనసాగే అంశంపైనా స్పష్టత ఇచ్చారు. 2027లో జరగబోయే వరల్డ్ కప్ టోర్నమెంట్ వరకు ఫిట్‌నెస్‌తో ఉంటేనే జట్టులో చోటు ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

బీసీసీఐ కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు.  కాగా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత గంభీర్ తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కాన్ఫరెన్స్ లో పలు అంశాలపై స్పందించారు.

2027 వరల్డ్ కప్ టోర్నమెంట్ వరకు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కొనసాగిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు గౌతమ్ గంభీర్ షాకింగ్ ఆన్సన్ ఇచ్చారు. వారిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందన్నారు. టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ ప్రకటించినా వారిని మించిన మేటి బ్యాట్స్ మెన్లు లేరని చెప్పారు.

వరల్డ్ కప్ దాకా వారు ఆడతారా? లేదా? అనేది వాళ్ల ఫిట్‌నెస్ పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ నిలబడగలిగితే ఆడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. టీ20 వరల్డ్ కప్ తో పాటు 50 ఓవర్ల వరల్డ్ కప్ లోనూ వారిద్దరూ తమ సత్తా ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నారన్నారు.  ఇంకొంతకాలం క్రికెట్ ఆడే సామర్థ్యం వారిలో ఉందని వ్యాఖ్యానించారు.

2025లో జరిగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటించే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటారని,  వారు తమ ఫిట్‌నెస్‌  కాపాడుకుంటే 2027 ప్రపంచ కప్‌లో నూ ఆడవచ్చని గౌతమ్ స్పష్టం చేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని, అప్పటివరకు జట్టులో కొనసాగాలా? వద్దా? అనేది వారి ఇష్టమేనని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.