JAISW News Telugu

Gautam Gambhir : గౌతం గంభీర్ ప్రెస్ మీట్.. రుతురాజ్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir : టీం ఇండియా కోచ్ గా ఎంపికైన గౌతం గంభీర్ మొదటి సారి శ్రీలంక టూర్ కు వెళ్లేముందు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి గౌతం గంభీర్ రిపోర్టర్లతో మాట్లాడారు. విరాట్ కొహ్లి వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్, అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం మంచి అవకాశంగా భావిస్తాను. ముఖ్యంగా 140 కోట్ల ప్రజల కోసం ఆడే ఆట కాబట్టి ఇక్కడ ఎలాంటి విభేదాలు ఉండవని చెప్పుకొచ్చాడు.

భారీ ఫామ్ లో ఉన్న రుత్ రాజ్ గైక్వాడ్ విషయంలో కూడా స్పందించాడు. జట్టులో 15 మందికి మాత్రమే చోటు ఉంటుంది. రుతురాజ్ లాంటి ప్లేయర్ ను తీసుకోకపోవడం బాధగానే ఉంది. కానీ అన్ని సమయాల్లో అందరినీ జట్టులోకి తీసుకోలేం. ఉదాహరణకు రింకూ సింగ్ ఫుల్ ఫామ్ లో ఉన్నా కూడా వరల్డ్ కప్ లో  టీ 20 జట్టుకు సెలెక్ట్ చేయలేదు. కారణలేమైనా.. కొన్ని సార్లు మంచి ప్లేయర్లు కూడా బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.

శ్రీలంక తో వన్డే సిరీస్ కు సంబంధించి రవీంద్ర జడేజాను పక్కనపెట్టలేదని కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చామని పేర్కొన్నాడు. శుభమన్ గిల్ మూడు ఫార్మాట్లకు చెందిన ఆటగాడని అన్ని ఫార్మాట్లలో కచ్చితంగా ఆడించాల్సిందేనని చెప్పాడు. విరాట్, రోహిత్ శర్మలు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నానని వారి ఆధ్వర్యంలో ప్రపంచకప్ నెగ్గాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

హర్దిక్ పాండ్యాను కెప్టెన్ గా కాకుండా ప్లేయర్ గా ఎంపిక చేయడంపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. హర్దిక్ లాంటి ఆల్ రౌండర్ మన జట్టుకు చాలా అవసరం అన్నాడు. ముఖ్యంగా అతడి ఫిట్ నెస్ లోపం వల్లే కెప్టెన్ గా ఎంపిక చేయలేదని చెప్పాడు. మొత్తం మీద గంభీర్ కోచ్ గా పదవీ చేపట్టిన తర్వాత మొదటి టూర్ లోనే ఇన్ని వివాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.

Exit mobile version