Gautam Gambhir : గౌతమ్ గంభీర్ తన రాజకీయ జీవితానికి వీడ్కోలు పలికారు. తనను రాజకీయాల నుంచి రిలీవ్ చే యాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రిక్వెస్ట్ చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిం చిన ప్రధాని మోడీకి, అమిత్ షాకు ఆయన కృత జ్ఞతలు చెప్పారు.
కోల్ కతా నైట్రైడర్స్ (కేకేఆర్) మెంటార్ గా పదవీ కాలం ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ బాధ్య తల నుంచి తనను తప్పించాలని గౌతమ్ గంభీర్ బీజేపీ చీఫ్ నడ్డాను కోరారు. క్రికెట్ పై ఫొకస్ పెట్టేం దుకు ఈ నిర్ణయ తీసుకున్నానని వెల్లడిం చారు.
‘‘నా రాబోయే క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడానికి రాజకీయ బాధ్యతల నుండి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థిస్తు న్నా ను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్’’ అని గంభీర్ ట్వీట్ చేశారు.
కేకేఆర్ కొత్త మెంటార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టే ముందుకు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2011-17 వరకు కోల్ కతా ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వ్యవహరించిన గంభీర్ 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. 2023 నవంబర్ 21న గంభీర్ కేకేఆర్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.
కాగా.. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుం చి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన లోక సభ స్థానం ఢిల్లీలోనే కాకుం డా, భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన స్థానాల్లో ఒకటిగా ఉంది. యమునా నదికి తూర్పు న ఉన్న ప్రాంతాల్లోని ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి.