Garuda Seva : తిరుమ‌లలో ఈ నెల 24న గ‌రుడ సేవ‌…మార్చి 9నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు..

Garuda Seva : తిరుమల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. ఈ నెల 24న గ‌రుడ‌సేవ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ట్లు టీటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క భ‌క్తుడు కోరుకుంటాడు. సుదూర ప్రాంతాల‌నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుంటారు. అయితే, ఆల‌యంలో ప్ర‌తి నెలా గ‌రుడ సేవ నిర్వ‌హిస్తుంటారు.

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 24న శ‌నివారం నాడు గరుడసేవ జర గనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు.

ఈనెల‌ 25న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఇక‌, ఈ ఆలయంలో మార్చి 1 నుండి 10 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయం శుద్దిచేస్తారు. ఆలయంతోపాటు పూజా సామాగ్రిని కూడా శుద్ధిచేయ‌డం జ‌రుగుతుంది. అదే రోజు ఉదయం 8 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

వ‌చ్చే నెల 9 నుంచి తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌ను న్నాయి. ఈ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 17 వ‌ర‌క కొనసాగుతాయి. వ‌చ్చే నెల 8న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్య‌క్ర‌మంతో ఈ బ్రహ్మోత్స‌వాలు నిర్వహిస్తారు. మార్చి 9న ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేస్తారు. ఆ రోజు రాత్రి శేష వాహన సేవ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఇక‌, అప్ప‌టినుంచి ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవ కార్య‌క్ర‌మాలు ఉంటాయి. వ‌చ్చే నెల 10న హంస వాహనం, 11న సింహ వాహనం, 12న హనుమంత వాహనం, 13వ తేది సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. వ‌చ్చే నెల 14న గజవాహనం, 15వ తేది న చంద్రప్రభ వాహనం, మార్చి 16న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. మార్చి 17న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం కార్య‌క్ర‌మం ఉంటుంది. వ‌చ్చే నెల 18న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం ఉంటుంది.

TAGS