MP Balashauri : గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. వచ్చే జూన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్ హోదాలో ఎంపీ బాలశౌరి, వైస్ ఛైర్మన్ హోదాలో ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపునకు సంప్రదింపులు జరిపామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా వారాంతపు రివ్యూలు నిర్వహిస్తామన్నారు.