Gangavva : గంగవ్వకు దెయ్యం.. వణికిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు అసలేమైందంటే?
Gangavva : బిగ్ బాస్ హౌస్ లో పాత పది మంది కంటెస్టెంట్ లు అడుగుపెట్టగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో బిగ్ బాస్ ను చూసే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా టేస్టీ తేజ, అవినాష్ ఇద్దరు కలిసి గంగ్వతో కలిసి ఫ్రాంక్ చేయిస్తారు. ఈ విషయం ఇద్దరికి తప్పా ఎవరికీ తెలియదు.
అందరూ పడుకున్న తర్వాత దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయు అని గంగవ్వకు చెబుతారు. అదే విధంగా గంగవ్వ రాత్రి అందరూ పడుకున్న తర్వాత లివింగ్ రూమ్ లోకి వచ్చి దెయ్యం పట్టినట్లు అరుస్తుంది. దీంతో గాఢ నిద్రలో ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. గంగవ్వ అరవడం చూసి ఏమైందోనని అనుకుంటారు.
మెహబూబ్ ఒక్కడే ఇది ఫ్రాంక్ అఅనుకుని గౌతమ్ తో చెబుతాడు. కాగా ఫ్రాంక్ అయితే ఇంత సేపు చేస్తుందా అని అనుమానిస్తాడు. రోహిణి కూడా గంగవ్వను చూసి వణికిపోతుంది. నిజంగానే దెయ్యం పట్టిందేమో అని అందరూ అనుకుంటారు. వీళ్లలోనే కలిసిపోయి అవినాష్, టేస్టీ తేజ ఇద్దరు కలిసి నటిస్తారు. అవ్వ ఏమైందే అంటూ అడుగుతుంటారు. కాగా ఎక్కడా అనుమానం రాకుండా చూసుకుంటారు.
అయితే వీరిద్దరూ బాత్రూం వైపు వెళ్లి అక్కడ పగలబడి నవ్వుతారు. ప్లాన్ చేసిన మనకే కారిపోయింది. మరి విషయం తెలియని వారి పరిస్థితి ఏంటి అని ఘోరంగా నవ్వుకుంటారు. చివరకు అవినాష్ కెమెరా వద్దకు వచ్చి నా పాత్ర ఏమీ లేదు. అంతా ఆ టేస్టీ తేజ గాడే చేశాడు. నా ఇన్ వాల్వ్ ఏమీ లేదంటూ చెబుతాడు. ఈ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇది ఫ్రాంక్ అని తేలడంతో ఆడియన్స్ తెగ నవ్వుకున్నారు. గంగవ్వ ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేసిందంటూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ సండే నాగార్జున వచ్చి చెప్పే వరకు ఇది ఫ్రాంక్ అన్న విషయం హౌస్ లో ఎవరికీ తెలియదు.