Gautam Gambhir : మూడోసారి కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత, జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో స్పందించాడు. గంభీర్ ఈ విజయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు గంభీర్ పోస్ట్‌లో, “ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారి రథాన్ని ఇప్పటికీ శ్రీ కృష్ణుడు నడుపుతున్నాడు” అంటూ రాసుకొచ్చాడు. గంభీర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గంభీర్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంభీర్ కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు కేకేఆర్ కి మెంటర్‌గా తిరిగి వచ్చిన గంభీర్.. షారుక్ ఖాన్ జట్టును మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిపాడు. చివరిసారి 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి గంభీర్ సారథ్యంలో కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది.
గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ 2012, 2014 లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతిని తెలిసిందే. ఇప్పుడు 2024లో కేకేఆర్ టైటిల్‌ను గెలుచుకుంది. కింగ్ ఖాన్ కోరిక మేరకు గంభీర్ జట్టుకు మెంటర్‌గా మారాడు.. చివరికి జట్టును టైటిల్ గెలిచే వరకు నడిపించాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 113 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ విజయానికి వారి బౌలర్లు అద్భుతమైన సహకారం అందించారు. స్టార్క్ రెండు వికెట్లు, వైభవ్ అరోరా 2 వికెట్లు, ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లు తీయగలిగారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మూడో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ట్రోఫీని గెలిచేందుకు పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజు చెపాక్‌లో కోర్బో, లోడ్బో, జీత్బో రే కథ నిజమైంది. గురు గంభీర్ ధైర్యం, చంద్రకాంత్ వ్యూహాలు, కేకేఆర్ ఆటగాళ్లు ఈ సీజన్‌లో అద్భుతాలు సృష్టించారు. ఈ జట్టు నాలుగోసారి ఫైనల్స్‌కు చేరి మూడుసార్లు విజయం సాధించింది.