JAISW News Telugu

Gambhir : గంభీర్ కోపిష్టి.. కోచ్ గా పని కొస్తాడా..

Gambhir

Gambhir

Gambhir : టీం ఇండియా క్రికెట్ లో కోచ్ పదవి అంటే మామూలు పోటీ ఉండదు. అలాంటిది గౌతం గంభీర్ కొత్త కోచ్ గా నియమితుడయ్యాడు. కోచ్ గా కాకముందు 2007, 2011 టీ 20, వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ క్రెడిట్ మొత్తం ఎంఎస్ దోనికి వెళ్లిపోయిందని చాలా సార్లు పరోక్షంగా విమర్శించారు. వ్యక్తి పూజ కాదు టీంలోని అందరినీ ప్రోత్సహించండని మీడియాకు, ఫ్యాన్స్ కు సూచించాడు.

టీం ఇండియా క్రికెట్ లో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రైట్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత  టీం ఇండియా కుదుపునకు లోనైన సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా, జాన్ రైట్ కోచ్ గా టీంను తీర్చిదిద్దిన తీరు ఎప్పటికీ మరిచిపోలేనిది.

టీం ఇండియా క్రికెట్ లో జాన్ రైట్ తర్వాత గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో టీం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ తర్వాత 2007 టీ 20 ప్రపంచ కప్ కు లాల్ సింగ్ రాజ్ పుత్ ను తాత్కాలిక కోచ్ గా పంపగా టీ 20 ప్రపంచ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కోచ్ గా అనేక మంది చేశారు. అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, లాల్ సింగ్ రాజ్ పుత్, రాహుల్ ద్రవిడ్ ఇలా అందరూ పని చేయగా.. చివరగా 2024 లో టీ 20 వరల్డ్ కప్ నెగ్గింది.

కానీ మధ్యలో కోచ్ గా అనిల్ కుంబ్లే, విరాట్ కొహ్లికి పడకపోవడంతో కుంబ్లే జట్టు నుంచి తప్పుకున్నాుడు. ప్రస్తుతం టీంలో మంచి ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగుతుంది. ఎలాగైనా సరే దాన్నే కంటిన్యూ చేయాలి. గౌతం గంభీర్ కాస్త కోపధారి మనిషి.. టీంలో సీనియర్లు, జూనియర్లు ఉంటారు. వారందరినీ ఎలా మెయింటెన్ చేస్తాడనేది ఇప్పుడు అందరిని  వేధిస్తోంది.

Exit mobile version