JAISW News Telugu

BRS:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. జై కొట్టిన బీఆర్ఎస్

Speaker of Telangana Assembly,

BRS:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే సూచనలు లేనందున కుమార్ స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే కావచ్చు. ఇవాళ మాజీ మంత్రి కుమార్, మధ్యాహ్నం 12.30 నుండి 12.40 గంటల మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి.

స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్‌ ఉస్సేన్‌ మద్దతు తెలిపారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. BRS 39 స్థానాలను కైవసం చేసుకోగా, దాని “స్నేహపూర్వక పార్టీ” AIMIM ఏడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది.

Exit mobile version