Gaami Twitter Review : విభిన్న కథతో విశ్వక్.. సినిమా ఎలా ఉందంటే..

Gaami Twitter Review

Gaami Twitter Review

Gaami Twitter Review  : విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి. శివరాత్రి పర్వదినం సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. గామి  మూవీ యూఎస్ ప్రీమియర్స్ యూఎస్ లో పడ్డాయి. దీంతో ఆడియన్స్ తమ  అభిప్రాయాలు చెబుతున్నారు. గామి చిత్రంపై మొదటి నుంచి ఓ రకమైన ఆసక్తి ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కావడంతో ప్రభాస్ కూడా ప్రమోట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ గామి చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు.

ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే మూవీపై ఆసక్తిని పెంచేలా చేశారు దర్శకుడు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు కూడా పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వచ్చాయి. ఇక గామి చిత్రంలో అసలు కథ ఏముంది అనేది చూస్తే.. అఘోరా అయిన విశ్వక్ సేన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతడు మనుషులను తాకకూడదు. మనషుల స్పర్శ విశ్వక్ ను వ్యాధిగ్రస్తున్ని చేస్తుంది.

దీనికి పరిష్కారం వెతుక్కుంటూ విశ్వక్ హిమాలయాలకు బయలుదేరుతాడు. కఠిన పరిస్థితుల మధ్య పోరాటం చేస్తాడు. అసలు ఈ అఘోరా ఎవరు? అతడి నేపథ్యం ఏమిటీ? ఈ వ్యాధికి కారణం ఏమిటీ? అనేది అసలు కథ. గామి మూవీ ఒక యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు విద్యాధర్ కాగిత ప్రతిభను ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. అతడు ఎంచుకున్న స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలియజేస్తున్నారు.

గామి చిత్రానికి విజువల్స్ ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బీజీఎం  సైతం మెప్పిస్తాయి. విశ్వక్ నటన మెచ్చుకోవాల్సిందే. కీలక పాత్రలో కనిపించిన చాందిని చౌదరి అలరించిందంటున్నారు నెటిజన్లు. అయితే సినిమా మెల్లగా సాగిందని, అయితే స్క్రీన్ ప్లే  బాగుండడంతో స్లో నరేషన్ ను ఆడియన్స్ బోర్ గా ఫీల్ కాలేదట. సినిమా చివరి 20 నిమిషాలు ఊపందుకుందని అంటున్నారు. మొత్తంగా గామి ఒకసారి చూడొచ్చని ఆడియన్స్ చెబుతున్నారు.

TAGS