JAISW News Telugu

Gaami Movie Review : మాస్ కా దాస్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయ్యిందా? గామి ఫుల్ మూవీ రివ్యూ..

Gaami Movie Review

Gaami Movie Review

Gaami Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాస్ సినిమాలతో అలరిస్తుంటాడు. కొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటూ మిడ్ రేంజ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నాడు. విశ్వక్ సినిమా అనే ట్యాగ్ జనాల్లోకి వెళ్తోంది కూడా.. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ చేసిన కొత్త ప్రయత్నం గామి మూవీ. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాతో విశ్వక్ సక్సెస్ అయ్యాడా? సినిమా ఎలా ఉంది? అనే విషయాలను ఓ సారి చూద్దాం..

కథ ఇది..

ఇది ఓ విభిన్న కథ. సినిమాలో మూడు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా విశ్వక్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. మాస్ లవర్ బాయ్ కాస్త ఇందులో అఘోరాగా నటించడం విశేషం. కథలోకి వస్తే ఈ ఆఘోరా ఎవరూ ముట్టుకోని ఓ తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటాడు. అలాగే అభినయకు సంబంధించిన స్టోరీ కూడా రన్ అవుతుంటుంది. విశ్వక్ తనకున్న జబ్బును తగ్గించుకోవాలంటే 36 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో ఉండే ఓ అద్భుతమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆయనకు ఉన్న జబ్బు పోయి ఆరోగ్యవంతుడు అవుతాడు అని చెప్తారు. ఇక ఈక్రమంలోనే తాను హిమాలయాలకు బయలుదేరుతాడు.

ఈ సమయంలో అతడికి చాందిని చౌదరి కలుస్తుంది. ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? చాందిని విశ్వక్ కు ఎందుకు హెల్ప్ చేస్తుంది. ఈ మూడు కథలను కలుపుతూ దర్శకుడు అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ విశ్వక్ తన జబ్బు పోగొట్టుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది?

సినిమా విశ్లేషణకు వస్తే దర్శకుడు విద్యాధర్ కాగిత రాసుకున్న కథ చాలా కొత్తగా ఉంది. స్టోరీకి అనుకూలంగా స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు. మూవీని చాలా గ్రిప్పింగ్ గా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సినిమాలో విద్యాధర్ దర్శకత ప్రతిభను మెచ్చుకోవచ్చు. అలాగే విశ్వక్ నటన చాలా బాగుంది. లవర్ బాయ్, మాస్ హీరోగానే కాదు మంచి కథ పడితే అద్భుత నటనను అతడిని నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

అయితే దర్శకుడికి అనుభవం లేకపోవడంతో కొన్ని సీన్లను హైలో చూపించడంలో కొద్దిగా తడబడ్డట్టు అనిపిస్తుంది. అయినా కూడా సినిమా డెప్త్ ను చెడకొట్టకుండా ఆడియన్స్ లో సినిమా తాలుకూ మూడ్ ను అయితే క్రియేట్ చేశాడనే చెప్పాలి. తాను నమ్ముకున్న కథను హానెస్ట్ గా ప్రజెంట్ చేశాడు. అయితే డైరెక్టర్ ఎంతసేపు విశ్వక్ క్యారెక్టర్ పైనే సినిమాను రన్ చేశాడు. కానీ అభినయ క్యారెక్టర్ లో ఎంతో డెప్త్ ఉన్నా ఆ రేంజ్ లో చూపించలేదు. చాలా సేపు విశ్వక్ పైనే స్క్రీన్ ప్లే ఉండడంతో ఆడియన్స్ కొద్దిగా బోర్ గా ఫీలైనట్టు తెలుస్తుంది.

ఎవరు ఎలా చేశారు?

నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే విశ్వక్ కొత్త క్యారెక్టర్ ను చాలెంజింగ్ గా తీసుకొని నటించినట్టు కనపడుతుంది. ఆయన నటించిన సినిమాల్లో ఇదే డిఫరెంట్ క్యారెక్టర్. అయినా బాగానే నటించి మంచి గుర్తింపే సాధించాడని చెప్పవచ్చు. తన నటనతో ఎన్నో ఎమోషన్స్ ను బాగా చేయగలిగాడు. చాందిని చౌదరి హీరోకు హెల్ప్ చేసే క్యారెక్టర్ లో నటించింది. సెటిల్డ్ గా నటించిందనే చెప్పవచ్చు. అభినయ తాను నటించిన ప్రతీ సీన్ లో జీవించిందనే చెప్పాలి. మిగతా పాత్రలు వాళ్ల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక పనితనం..

సాంకేతిక విభాగం పనితీరు చూస్తే.. నరేష్ కుమారన్ అందించిన సంగీతం ఓకే అనిపించింది. బీజేఎం బాగుంది. సీన్స్ ను ఎలివేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అయ్యింది.  సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి అందించిన విజువల్స్ సినిమా రేంజ్ ను మరింత పెంచాయి. తక్కువ బడ్జెట్ లో ఆయన అందించిన విజువల్స్ ఆడియన్స్ ను కట్టిపడేశాయనే చెప్పవచ్చు. రాఘవేంద్ర ఎడిటింగ్, సునీల్ రాజు స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

-కథ
– విశ్వక్ సేన్

మైనస్ పాయింట్స్:

– కొన్ని సీన్లు బోర్ కొట్టేలా ఉండడం
– డైరెక్టర్  అనుభవలేమి కారణంగా కొన్ని సీన్లను ఆడియన్స్ కు కనెక్ట్ చేయలేకపోయారు.

రేటింగ్:
2.75/5

మా మాట:

‘గామి’తో విశ్వక్ ఘటికుడు అనిపించుకున్నట్టే.

Exit mobile version