JAISW News Telugu

Two or More Sons : ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న వారికి ఫుల్ డిమాండ్.. ఎందుకంటే?

Two or More Sons

Two or More Sons

Two or More Sons : మూఢ నమ్మకాలు వద్దని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.. చంద్రుడిపైకి, సూర్యుడిపైకి ఉప గ్రహాలను పంపే స్థాయికి ఎదిగినా ఇంకా మూడ నమ్మకాల జాడ్యం మాత్రం వీడడం లేదు. ‘అదిగో పులి అంటే తోక బారెడు’ అన్నట్లుగా సోషల్ మీడియా కూడా తయారైంది. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి నుంచి పారద్రోలాల్సిన మీడియాలో (అది ఏదైనా కవచ్చు) వాటి పుకార్లను మరింత విస్తరిస్తుంది. ఫలితంగా మూఢ నమ్మకాలనే వేర్లు మరింత లోతుగా పాతుకు పోతున్నాయి.

పండుగ వస్తుందంటే చాలు వింత ప్రచారాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ సారి సంక్రాంతికి గాజుల గండం పట్టుకుంది. దీంతో మహిళలు గాజుల దుకాణాల్లో క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే టాపిక్.. ఈ ప్రచారం పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్రతీ ఇంటికి చేరింది.. ఇంకే ముంది.. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకు ఉన్న తల్లులు పరుగులు పెడుతున్నారు.. వారి వద్ద డబ్బులు తీసుకొని కీడు పోవాలని గాజులు వేసుకుంటున్నారు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని, అందుకే ఒక్క కొడుకు ఉన్న గృహిణులు, ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న గృహిణిల వద్ద  డబ్బు తీసుకొని దాంతో ఐదు రకాల గాజులు కొనుక్కొని సంక్రాంతి లోగా వేసుకోవాలట. ఇలా అయితే.. కీడు తొలగిపోయి ఒక్క కొడుకుకు ఏమీ కాదట. ఈ ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.

తన కొడుకుకు ఎలాంటి హానీ జరగవద్దని తల్లులు ఇద్దరు కొడుకులు ఉన్న బంధువులు, ఫ్రెండ్స్ వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకుంటున్నారు. అలా ధరించిన గాజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరక్షరాస్యులు నమ్మారనుకోండి కానీ విద్యా వంతులు కూడా ఇదే నమ్ముతారా? గాజులు వేసుకున్న ఫొటోలు షేర్ చేస్తూ కామెంట్లు పెట్టడంతో వేద పండితులు చీవాట్లు పెడుతున్నారు. ఇలాంటి ఆచారం ఏ శాస్త్రంలో లేదని.. ఇలాంటివి నమ్మవద్దని సూచిస్తున్నారు. పండుగలకు కీడు లాంటివి రావని ఒక వేళ వచ్చినా ఇలాంటి ప్రాయశ్చిత్తాలు మాత్రం ఉండవని సూచిస్తున్నారు.

Exit mobile version