AP Congress : ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్!

Congress

AP Congress

AP Congress : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరింత టైం దగ్గరపడుతోంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారించాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎనిమిది జాబితాలను విడుదల చేయగా.. టీడీపీ+జనసేన కూటమి ఒక్క లిస్ట్ లోనే 99 మంది పేర్లను ఖరారు చేశారు. ఈ సారి గేమ్ ఛేంజర్ అవుతామని గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఆశావహులు గతంలోనే ఆమెకు దరఖాస్తులు సమర్పించారు. వారితో ఆమె ముఖాముఖి మాట్లాడారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు.

ప్రజాబలం ఉన్న నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరారు. దీంతో ప్రముఖ నేతలు ఎవరూ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. కానీ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు షర్మిల నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే దరఖాస్తులు ఆహ్వానించిన సమయంలో పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. తాము చేసిన ప్రజాసేవ,తో  కాంగ్రెస్ పార్టీకి, పార్టీలో కొనసాగిన విధానంపై పూర్తి స్థాయిలో వివరించారు. ఏపీ పీసీసీ చీఫ్ వారితో మాట్లాడి అందులో నుంచి బలమైన నేతలను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తుంది.

విజవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘ఆంధ్రరత్న భవన్’ గతంలో ఎప్పుడూ ఖాళీగా కనిపించేంది. కానీ షర్మిల బాధ్యతలు తీసుకున్నాక సందడి కనిపిస్తోంది. ప్రతి రోజూ.. ఆంధ్రరత్న భవన్‌లో నాయకులు, ఆశావహులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈ సారి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తే వైసీపీ, టీడీపీ, జనసేనకు ధీటుగా వెళ్లవచ్చని షర్మిల నమ్మకంతో ఉంది.

TAGS