suspense thriller : సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి భారీ యాక్షన్ వరకు ఓటీటీలో ఈ వారం ఉన్న సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇవే..

suspense thriller

suspense thriller

Suspense thriller : ప్రతీ వారంలో లాగానే ఈ వారం కూడా భారీ సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ సిద్ధమైంది. ఈ సారి మంచి మంచి సినిమాలను, షోలను వ్యూవర్స్ ముందుకు తీసుకువచ్చింది. అద్భుతమైన లైనప్‌తో తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల అభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలు, హృదయాన్ని ఎమోషనల్, థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ వెబ్ సిరీస్‌ల వరకు, ప్రతి ఒక్కరికీ ఓటీటీ మంచి విందు ఏర్పాటు చేసింది. ఏఏ ప్లాట్ ఫారంలో ఏఏ మూవీ, వెబ్ సిరీస్ ఉందో తెలుసుకుందాం.

ఆహాలో..
హరోం హర..
ఆహా ప్లాట్ ఫారంలో జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’  స్ట్రీమింగ్ లో ఉంది. తెలుగులో భారీ యాక్షన్ డ్రామాగా థియేటర్లలో మెప్పించింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్ నటించారు. జూన్ 14, 2024న విడుదలైన ఇది మిశ్రమ సమీక్షలను అందుకుంది.

హాట్ స్పాట్..
నాలుగు డిఫరెంట్ కథలను మిక్స్ చేసిన తీసిన సినిమా ‘హాట్ స్పాట్’. తమిళంలో మంచి వ్యూవర్ షిప్ ను అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో జూలై 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చింది. విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2024 భారతీయ తమిళ భాషా సంకలన చిత్రంలో కలైయరసన్, సోఫియా, శాండీ, అమ్ము అభిరామి, జనని, గౌరీ కిషన్, సుభాష్, ఆదిత్య భాస్కర్ నటించారు.

ఈటీవీ విన్ లో..
మ్యూజిక్ షాప్ మూర్తి..
మంచి కథాంశంతో తెరకెక్కించిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఆధ్యంతం ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. మ్యూజిక్ షాప్ నడిపించే మూర్తికి సంపాదన సరిపోకపోవడంతో తనకు ఇష్టమైన సంగీతాన్ని వదిలిపెట్టకుండా డీజే ప్లేయర్ కావాలనుకుంటాడు. ఆ తర్వాత ఒక యువతి వద్ద డీజే నేర్చుకొని 50 సంవత్సరాల వయస్సులో తన కోరికను నెరవేర్చుకుంటాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి ఉన్నారు.

https://www.youtube.com/watch?v=bXUOeeIXfT8&t=14s

జీ 5లో..
బహిష్కరణ
జూలై 19న జీ 5లో బహిష్కరణ స్ట్రీమింగ్ లోకి రానుంది. ఈ షో ప్రేమలో ఉన్న జంట చుట్టూ తిరుగుతుంది, వారి సంబంధం సమస్యలను ఎదుర్కొన్నప్పుడు సామాజిక అపహాస్యం, అవమానాన్ని ఎదుర్కొంటుంది. అంజలి, రవీంద్ర విజయ్, అనన్య నాగెళ్ల నటించిన ఈ సిరీస్ భావోద్వేగంతో కూడుకున్నది.

త్రిభువన్ మిశ్రా CA టాపర్..
నెట్‌ఫ్లిక్స్ లో ‘త్రిభువన్ మిశ్రా CA టాపర్’ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ త్రిభువన్ మిశ్రా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) కావడానికి అతని ప్రయాణంలో, ఆశయం, పోరాటం, శృంగారం ఇతివృత్తాల గురించి దర్శకుడు బాగా చిత్రీకరించాడు.

https://www.youtube.com/watch?v=Jm109fPG4zI

ది గోట్ లైఫ్
‘ది గోట్ లైఫ్’ కూడా ఈ నెల 19న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇది మలయాళంలో హిట్ అయిన చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ లోకి తెచ్చారు. భారతీయ వలస కార్మికుడు నజీబ్ ముహమ్మద్ నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరించారు. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

TAGS