Ravi Teja Movies : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారు కొందరు ఉంటారు. అందులో మొదటి వరుసలో నిల్చున్న నటుడు మాస్ మహరాజ రవితేజ. కేవలం బ్యాగ్రౌండే కాదు.. టాలెంట్ ఉంటూ ఇండస్ట్రీలో తమకు గుర్తింపు తెస్తుందని చాటిన నటుడు ఆయన.
రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పాత్రను ఇప్పటి వరకు ఉన్న సినిమాల కంటే డిఫరెంట్ గా చూపించారు. రవితేజ పాత సినిమాలు ఈగల్ సినిమాకు ఒక పోలిక ఉంది. అందేంటో ఇక్కడ చూద్దాం.
‘ఈగల్’ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది. ఈ మూవీలో హీరోయిన్ చనిపోతుంది. ఇలాంటి ఫ్లాష్ బ్యాకే మరికొన్ని సినిమాల్లో కూడా ఉంది. అందులో హీరోయిన్ చనిపోతుంది. రవితేజ హీరోగా నటించిన ‘షాక్’లో ‘జ్యోతిక’ మరణిస్తుంది. ‘వీర’ మూవీలో కాజల్ అగర్వాల్ పోషించిన చిట్టి పాత్ర కూడా మృతి చెందుతుంది. ‘టైగర్ నాగేశ్వరరావు’లో కూడా నుపుర్ సనన్ చనిపోతుంది. ‘డిస్కో రాజా’లో పాయల్ రాజ్‌పుత్ చనిపోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘బలుపు’లో కూడా అంజలి మరణిస్తుంది. అలా ఈ 6 సినిమాలకు కామన్ పాయింట్ ఉంది. దీంతో పాటు మరొక కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ హీరోయిన్స్ చనిపోవడం ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటుంది.
ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రవితేజ చనిపోవడం, లేదంటే హీరోయిన్ ను చంపిన వారిపై పగ తీర్చుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన మిరపకాయ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబోలో మళ్లీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా హిందీ సినిమా అయినా రైడ్ సినిమా రీమేక్ గా రూపొందుతోంది అని అన్నారు.