Malaysia to Maldives : మలేషియా నుంచి మాల్దీవుల వరకు అన్నీ హిందూ దేశాలే.. ముస్లిం దేశాలుగా ఎలా మారాయి?
Malaysia to Maldives : కొన్ని శతాబ్దాల క్రితం హిందూ మతం భారతదేశం నుంచి దక్షిణాసియా దేశాలకు వ్యాపించడం ప్రారంభించింది. ఇండోనేషియా నుంచి మలేషియా, థాయ్‌లాండ్ వరకు పెరగడం ప్రారంభమైంది. దేశంలో పల్లవ రాజుల కాలం.. నాల్గవ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య దక్షిణాసియా దేశాల్లో హిందూ మతం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. రాజులు ప్రజలు హిందూమతాన్ని స్వీకరించడం ప్రారంభించారు. 10వ శతాబ్దం తర్వాత పరిస్థితి మెల్ల మెల్లగా మారడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయాయి.
15వ శతాబ్దానికి ముందు మలేషియా వాసులు హిందూ-బౌద్ధ లేదా స్వదేశీ మతాలను పాటించేవారు. 1700 సంవత్సరాల క్రితం భారత్ తో వాణిజ్యం ద్వారా హిందూమతం మలేషియాకు వ్యాపించింది. 7వ-13వ శతాబ్దాల మధ్య మలేషియాలో హిందూ సంస్కృతి పరిఢవిల్లింది. ప్రాచీన హిందూ-బౌద్ధ రాజ్యం లంకాసుకా మలయ్ ద్వీప కల్పంలో ఉంది. నేడు మలేషియా జనాభాలో 9 శాతం తమిళులు, వారిలో ఎక్కువ మంది హిందూ మతం అనుసరిస్తున్నారు, జనాభాలో ఎక్కువ మంది ముస్లింలే.
*ఇండోనేషియా ఇస్లాం దేశంగా ఎలా మారింది..
ఇండోనేషియాలో హిందూ మతమే మెజారిటీగా ఉండేది. మొదటి శతాబ్దంలో భారతీయ వ్యాపారులు, పండితులు, పూజారులు, నావికుల ద్వారా ఇండోనేషియా వరకు హిందూ మతం వ్యాపించింది. 7వ- 16వ శతాబ్దాల మధ్య, హిందూ-బౌద్ధ సామ్రాజ్యాలు ఇండోనేషియాగా ఉన్న ప్రాంతాన్ని పాలించాయి.
క్రీ.శ. 5వ శతాబ్దంలో జావాలో హిందూ మతంలోని శైవ శాఖ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 5వ- 13వ శతాబ్దాల మధ్య, సుమత్రా, జావా, కాలిమంతన్‌లో ముఖ్యమైన హిందూ రాజ్యాలు స్థాపించబడ్డాయి. ద్వీప సమూహం చివరి ప్రధాన సామ్రాజ్యం, మజాపహిత్ (1293-1500), హిందూ మతం, బౌద్ధ మతం, ఆనిమిస్ట్ విశ్వాసాల కలయిక.
ఇప్పటికీ ఇండోనేషియాలోని 6 అధికారిక మతాల్లో హిందూ మతం ఒకటిగా ఉండేది. 0.5 మిలియన్లకు పైగా హిందూ జనాభా, పౌరులు ఉన్న దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి, బాలిలో 87 శాతం హిందువులు ఉన్నారు.
*ఇండోనేషియాలోని బాలిలో ఇప్పటికీ హిందూ మెజారిటీనే
ఇక్కడ 27 కోట్ల జనాభాలో 86.7 శాతం ముస్లింలు, 1.74 శాతం మంది హిందువులు ఉండేవారు. బాలి ద్వీపంలో హిందువుల జనాభా ఎక్కువ . 90 శాతం హిందువులు నివసిస్తున్నారని నమ్ముతారు. ఇండోనేషియాలో హిందూ మతం అధికారికంగా ‘ఆగమా హిందూయిజం’ అని పిలుస్తారు. ఈ మతంలో కుల వ్యవస్థ లేదు.
*కంబోడియాలోని పెద్ద జనాభా ఒకప్పుడు శైవ భక్తులు
శివుడిని ఆరాధించే హిందువులు మెజార్టీగా ఉండే దేశం ‘కంబోడియా’. 100 బీసీ – 500 ఏడీ మధ్య ఫునాన్ సామ్రాజ్యం సమయంలో కంబోడియాలో హిందూమతం వృద్ధి చెందింది. అందరూ విష్ణువును, శివుడిని పూజించేవారు. కంబోడియా ఒకప్పుడు శక్తివంతమైన హిందూ, బౌద్ధ ఖైమర్ సామ్రాజ్యం నుంచి ఉద్భవించింది.
ఈ సామ్రాజ్యం ఇండో చైనా ప్రాంతాన్ని 11వ, 14వ శతాబ్దాల మధ్య పాలించింది. ఆ సమయంలో కంబోడియా మత సంస్కృతి శైవం. ఈ పరిస్థితి 15వ శతాబ్దం వరకు కొనసాగింది. దీని తర్వాత దేశం ఇప్పుడు బౌద్ధ ఆధిపత్యంగా మారింది. నేడు, కంబోడియాలోని జనాభాలో 97 శాతం మంది ‘థెరవాడ బౌద్ధం’ను అనుసరిస్తున్నారు.
*ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ రాజులు ఉండేవారు
6వ శతాబ్దం వరకు ఆఫ్ఘనిస్తాన్ కూడా హిందూ-బౌద్ధుల ఆధిపత్య ప్రాంతం. ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను హిందూ రాజులు పాలించేవారు. 11వ శతాబ్దంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అవి మసీదులుగా మార్చబడ్డాయి. కల్లార్, సామంత్‌దేవ్, అష్టపాల్, భీమ్, జైపాల్, భీంపాల్, ఆనంద్‌పాల్, త్రిలోచన్‌పాల్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రధాన హిందూ రాజుల పేర్లు. కానీ ఇప్పుడు అక్కడ హిందూ మతం అనుసరించే వారి సంఖ్య 1000కి తగ్గింది. 99 శాతం కంటే ఎక్కువ మంది పౌరులు ఇస్లాంలో ఉండిపోయారు. 90 శాతం సున్నీ ఇస్లాంను అనుసరిస్తున్నారు.
*థాయిలాండ్ హిందూ దేశం కాదు.. కానీ
థాయిలాండ్ లో ఒకప్పుడు హిందూ మెజారిటీ ఉండేదని నమ్ముతారు. కానీ, మెజారిటీ హిందూ దేశం కాదు. హిందూ మతం ప్రభావం మాత్రం ఉంది. హిందువలు అక్కడ మైనార్టీలు. 84,400 మంది హిందువులు ఇప్పుడు నివసిస్తున్నారు. కానీ బలమైన హిందూ ప్రభావం మాత్రం ఉంది. ఇది బౌద్ధమతంలో మెజారిటీ మతం ఉన్న దేశం. తమిళ, గుజరాతీ వలసదారులు 1800 చివరలో రత్నాలు, వస్త్ర పరిశ్రమలో పని చేసేందుకు థాయిలాండ్ వెళ్లారు. 1890లో పంజాబ్ నుంచి సిక్కులు, హిందువులు అక్కడికి వెళ్లారు.
* వియత్నాంలో కూడా..
ఒకప్పుడు వియత్నాంలో హిందూ జనాభా గణనీయంగా ఉండేది. కానీ, క్రమంగా తగ్గిపోయింది. పురాతన కాలంలో గ్రేటర్ ఇండియా కింద కనిపించే దేశాల్లో వియత్నాం కూడా ఉండేది. ఇది కూడా థాయ్ లాండ్ లాగా హిందువుల ఆధిపత్యం కానప్పటికీ.. హిందూ భావజాలం తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా 70 వేల మంది వరకు చామ్ హిందువులు వియత్నాంలో నివసిస్తున్నారు. ఇక్కడ నివసించే చాలా మంది ప్రజలు బౌద్ధంతో పాటు స్థానిక మతంను పాటిస్తారు. ఇందులో స్థానిక దేవతలు, మాతృ దేవతలను పూజిస్తారు. ఇది హిందూ మతాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ 7వ శతాబ్దం లేదా అంతకు ముందు హిందూ దేవాలయాలు ఉన్నాయి.
* ఫిలిప్పీన్స్‌పై కూడా..
తొమ్మిదో శతాబ్దం చివరి నాటికి ఫిలిప్పీన్స్‌లో హిందూ మతం ప్రభావం చూపింది. 1989లో లగునా తామ్ర శాసనం బయటపడింది. 16వ శతాబ్దంలో యూరోపియన్ వలస సామ్రాజ్యాలు రాకముందు ఇండోనేషియా ద్వారా ఫిలిప్పీన్స్‌లో హిందూ మతం ప్రభావం చూపిందని దీని ద్వారా తెలిసింది. 13వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలకు శ్రీవిజయ, మజాపహిత్ ద్వారా హిందూ మతం – బౌద్ధ మతం పరిచయం జరిగింది. ఆ తర్వాత మిషనరీలు ఇక్కడికి చేరుకున్నప్పుడు దేశం మెజారిటీ క్రైస్తవంగా మారింది. ఫిలిప్పీన్స్‌లో హిందూ ప్రభావం ఉంది. 351 పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అనేక దేవాలయాలు ధ్వంసం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
* మాల్దీవులు హిందూ చోళ రాజుల పాలనలో ఉండేది
మాల్దీవులు 12వ శతాబ్దం వరకు హిందూ రాజుల ఆధీనంలో ఉండేవి. తర్వాత బౌద్ధమతానికి కేంద్రంగా మారింది. తమిళ చోళ రాజులు ఈ దీవులను పాటించారు. కానీ, ఆ తర్వాత ముస్లిం దేశంగా మారడం మొదలైంది. ప్రస్తుతం ఇస్లాం ఇక్కడ అధికారిక మతంగా ఉంది. ముస్లిమేతర వ్యక్తి మాల్దీవుల పౌరుడు కాలేడు. చారిత్రక ఆధారాలు, ఇతిహాసాల ప్రకారం.. మాల్దీవుల చరిత్ర 2,500 సంవత్సరాలకు పైగా ఉంది. 12వ శతాబ్దం తర్వాత అరబ్ వ్యాపారుల ప్రభావంతో ఇక్కడి రాజులు ముస్లింలుగా మారడం ప్రారంభమైంది. 6 ఇస్లామిక్ రాజ వంశాల శ్రేణి మొదలైంది. ఆ తర్వాత ప్రజలు ముస్లింలుగా మారడంతో దేశం ముస్లిం దేశంగా మారిపోయింది.
శ్రీలంకలో కూడా..
బౌద్ధం రాక ముందు, శ్రీలంకలో హిందూ మతం ఆధిపత్యంగా ఉండేది. దక్షిణ భారతం నుంచి శ్రీలంకకు తమిళుల వలస కారణంగా హిందూ మతం వ్యాప్తి చెందవచ్చు. చోళ సామ్రాజ్యం దక్షిణ భారతీయ తమిళుల పాలన శ్రీలంకలో హిందూ మతం అభివృద్ధి చెందేందుకు అవకాశాలుగా మారాయి. శ్రీలంకలో 1881లో.. 21.51 శాతం ఉన్న హిందువుల జనాభా 1921కి వచ్చే సరికి 25 శాతానికి చేరింది. కానీ, 2012లో 12.58 శాతానికి తగ్గింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి..
– బ్రిటిష్ తీసుకొచ్చిన ఒప్పంద కార్మికులు భారత్ కు తిరిగి వచ్చారు.
– జూలై 1983 – మే 2009 మధ్య జరిగిన శ్రీలంక అంతర్యుద్ధం కూడా తమిళ హిందువుల వలసలకు కారణంగా మారింది.
-2012 జాతీయ జనాభా లెక్కల ప్రకారం.. శ్రీలంక జనాభా 70.2 శాతం బౌద్ధులు, 12.6 శాతం హిందువులు, 9.7 శాతం ముస్లింలు, 7.4 శాతం క్రైస్తవులు.
అశోక చక్రవర్తి పాలనలో, బౌద్ధ మతం ప్రచారం చేసేందుకు తన కుమార్తెను శ్రీలంకకు పంపినప్పుడు అక్కడి జనాభాపై బౌద్ధ ప్రభావం కనిపించడం ప్రారంభిమైంది. ఆ తర్వాత శ్రీలంక క్రమంగా బౌద్ధదేశంగా మారడం ప్రారంభమైంది. పురాణాల ప్రకారం, పురాతన కాలంలో దేశాన్ని కుబేరుడు పాలించాడు. దాన్ని రావణుడు స్వాధీనం చేసుకున్నాడు. రామ రావణ యుద్ధంలో రాముడు గెలిచిన తర్వాత విభీషణుడికి లంకను రాముడు అప్పగించారు.