JAISW News Telugu

Chanakya Niti : ఈ నలుగురితో స్నేహం మీ వినాశనానికి కారణం కావచ్చు.. పొరపాటున కూడా వీరిని దగ్గరికి రానీయకండి..

Chanakya Niti

Chanakya Niti

Chanakya Niti : ఆధ్యాత్మికత భారతంలో మహోన్నతమైన వ్యక్తుల్లో ఆచార్య చాణక్యుడు ఒకరు. సమస్త మానవాళి బాగు కోసం ఆయన ఎన్నో గ్రంథాలను, వేధాలను రచించాడు. ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వ శాస్త్రం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రంథాలను ఆయన సమస్త మానవాళికి అందించాడు. ‘చాణక్య నీతి’ పేరిట చాలా విషయాలను చెప్పుకుంటూనే ఉన్నాం.

జీవితంలో ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరితో స్నేహం చేయాలి? అనే విషయాలను ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మార్గదర్శకాలు  అందించాడు. చాణక్యుడు చెప్పిన నీతిని జీవితంలోకి అన్వయించుకొని.. శ్రద్ధగా పాటిస్తే మీ జీవితాన్ని సులభంగా గడపవచ్చు. చాణుక్యుడు చెప్పిన విధంగా జీవితంలో కొందరికి దూరంగా ఉండాలి? ఎవరిని విశ్వసించాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

భూమిపై అనేక రకాలైన మనుషులు, మనస్తత్వాలు ఉంటాయి. స్నేహితులు కూడా కొన్ని సార్లు శత్రువులుగా మారుతారు. తెలియని వ్యక్తులను.., కొన్ని రకాల ఆలోచనలు ఉన్నవారిని నమ్మి చేరదీస్తే వారి అవసరాన్ని బట్టి మోసం చేసి వెళ్లిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని దూరంగా ఉంచాలి? ఎవరిని దగ్గరకు తీయాలి? చాణక్యుడి నీతి శాస్త్రంలో కొన్ని మార్గదర్శకాలు అందించాడు.

 

తెలివిలేని వారిని పక్కన పెట్టండి..
చాణక్యుడు మూర్ఖుడిని జంతువుతో పోల్చాడు. మనిషే అయినా తెలివి, విచక్షనా జ్ఞానం లేనివాడు పశువుతో సమానం అని చాణక్య చెప్పాడు. ఇక వారితో స్నేహం చేయవద్దు. అలాంటి వారితో స్నేహం చేస్తే వారితోపాటు మీకూ కష్టాలు వస్తాయి. మూర్ఖుడైన స్నేహితుడి కంటే తెలివైన శత్రువు మంచివాడు.

అహంకారితో..
అహంకారి, తనను తాను జ్ఞానవంతుడిగా భావించే వాడికి మద్దతు ఇవ్వద్దు. అలాంటి వారు పక్కన ఉండడం చాలా డేంజర్. తనను తాను గొప్పగా చెప్పుకునేందుకు మీ ఇమేజ్‌ను పాడు చేయవచ్చు. మిమ్ములను అవమాన పాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ధనం లేకున్నా జ్ఞానం ఉన్న అహంకారం లేని వారితో స్నేహం చేయాలి.

అత్యాశగల వ్యక్తులతో..
అత్యాశ ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలి. తనకంటే బలహీనమైన, అత్యాశ కలిగిన వ్యక్తితో స్నేహం చేయద్దు. అత్యాశ ఉన్నవాడు తన ప్రయోజనాల కోసం మిమ్మల్ని నట్టేట ముంచవచ్చు. ప్రత్యర్థితో చేతులు కలపవచ్చు. అందుచేత ఉన్నవాటితో తృప్తిగా గడిపే వారినే స్నేహితుడిగా ఎంచుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

ఇలాంటి వాడు ఎప్పుడూ ఇబ్బందే..
ఆచార్య చాణక్యుడు తన విధానంలో చెడ్డ వ్యక్తిని తనతో ఉంచుకోవద్దని చెప్పాడు. ఇలాంటి వారు పాము కంటే ప్రమాదం. అవతలి వ్యక్తి తనకు హాని కలిగిస్తాడని మాత్రమే పాము కాటేస్తుంది. దుష్టుడికి విశ్వాసం ఉండదు. ఇలాంటి వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ద్రోహం చేసి ప్రాణాలను తీయవచ్చు.  

Exit mobile version