Indian Mangoes : వేసవి వచ్చిందంటే చాలు సీజనల్ ఫ్రూట్ అయిన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. మామిడి పండ్లతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు మామిడి ప్రియులు కేవలం మామిడి కాయల కోసమే వేసవి కాలం వరకు వేచి చూస్తారు. ఇక మామిడిలో అనేక రకాలు ఉన్నాయని మనకు తెలిసిందే. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కాయ ప్రసిద్ధి చెందింది. కొన్ని కాయలుగా ఉన్నప్పుడే తెంపితే చట్నీలు (పచ్చళ్లు) పెట్టుకోవచ్చు.
మామిడి కాయ భారతదేశంలో ఎక్కువగా దొరికే ఫ్రూట్. బంగిన్ పల్లి, కోత మామిడి, అల్ఫాన్సో, కేసరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, మల్లిక, తోతాపురి ఇలా చాలా రకాలుగా దొరుకుతాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా భారత్ లో మాత్రమే దొరుకుతాయి. ఎక్స్ పోర్ట్ గురించి పక్కన పెడితే.. ఇతర దేశాల్లో ఇక్కడి మ్యాంగో లాంటి పండు దొరకదు. పైగా ఇది ‘నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు దక్కించుకుంది. కాబట్టి ఇక్కడి (ఇండియా) మ్యాంగోకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
ప్రవాసులకు ఇక్కడి మామిడి కాయలను అందించాలని కొన్ని వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటి ద్వారా దేశానికి చెందిన మ్యాంగో ఇతర దేశాలకు ఎక్స్ పోర్ట్ చేసి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన వ్యాపార సంస్థ ‘ARRA’. ఈ వ్యాపార సంస్థ 2019 లో స్థాపించబడింది. ఇండియాలోని ఫ్రూట్స్ ను అమెరికాలో విక్రయించడం చేస్తుంది. ఒక్క మ్యాంగోనే కాదు.. ఇతర ఇండియా ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి.
మరిన్ని వివరాలకు : ఆదిత్య 630-464-1476,
రామకృష్ణ (RK) 614-558-5570లో సంప్రదించాలని కోరుతున్నారు.