JAISW News Telugu

Congress : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్..! ఇప్పుడు లభో దిభో అంటే ఏంటి ఫాయిదా..?

Congress

Congress

Congress : ఎన్నికలను ఎదుర్కోవాలంటే అంత ఆశామాషీ విషయం కాదు. అదీ భారత్ లో మరింత క్రిటికల్ గా ఉంటుంది. ఆర్థికంగా కోట్లాది రూపాయలు చేతిలో ఉండాల్సిందే. ఎన్నికల షెడ్యూల్ రిలీజైనప్పటి నుంచి చేతిలో పైసలు ఉండాల్సిందే.. బ్యానర్ల నుంచి కార్యకర్తలను మందు, విందు వరుకు ప్రతీది రూపాయితోనే సాగుతుంది. అందుకే పెద్ద పార్టీల నుంచి చిన్నా, చితకా పార్టీలు వాటి ఖాతాల్లో అమౌంట్ మెయింటెన్ చేస్తూనే ఉంటాయి.

ఈ మధ్య జాతీయ పార్టీ కాంగ్రెస్ కు వింత సమస్య ఎదురైంది. ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న కాస్త డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యాయి. దీంతో అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక ఆపసోపాలు పడుతుంది. ఐదేళ్లకు ఒకసారి వెలువడే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికలకు వెళ్లాలంటే డబ్బులు కావాలి. కానీ కాంగ్రెస్ వద్ద ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే భారత ఐటీ కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పెద్ద మనుషులే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

పరిస్థితి ఎంతలా మారిందంటే నాయకులు ఒకచోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటే చేతిలో రూపాయి కూడా లేదట. దీంతో పోటీలో నిలబడే అభ్యర్థులకు ఎలాంటి ఆర్థిక సాయం అంద లేదు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘ఈ దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా.. ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీ హక్కులను కాపాడలేకపోతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సామెతలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ప్రతి పక్షమైనా పాలక పక్షమైనా నిబంధనలు అందరికీ సేమ్ గా ఉంటాయి కదా.. ఒక వేళ పాలక పక్షంకు ఉండవంటే.. 2014కు ముందు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిబంధనలు పాటించలేదా? తమకు గుండు సూది గుచ్చుకున్నా పాలక పక్షంపై నెడితే సానుభూతి పొందచ్చని చూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక శాఖ పార్టీ ఫండ్ కు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారు. దీంతో ఐటీ శాఖ రంగంలోకి దిగి ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ విషయం నేరుగా చెప్పకుండా ముక్కు ఎక్కడంటే చుట్టూ తిరిగి చూపినట్లు కనిపిస్తుందని రాహుల్ ప్రసంగం. బీజేపీ పార్టీనే పని గట్టుకొని ఏదో చేసిందని చెప్పడం కాంగ్రెస్ విచక్షణకే విడిచిపెట్టాలని రాజకీయ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Exit mobile version