PMGKY : మరో ఐదేళ్ల పాటు ప్రజలకు ఫ్రీ రేషన్
PMGKY : బీజేపీ ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఐదేళ్లపాటు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు వచ్చే ఐదేళ్లలో రూ.11.8 లక్షల కోట్లు ఖర్చవుతాయని తెలుస్తోంది. దేశంలో కొవిడ్ సమయంలో పేదలకు అండగా ఉండేందుకు 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులకు ఒకరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంతో మరో ఐదేళ్ల పాటు కొనసాగించనుంది.
స్వశక్తి మహిళలకు వ్యవసాయ డ్రోన్లు అందించే పథకానికి కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 15 వేల డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందించి వారికి శిక్షణ ఇవ్వనుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు డ్రోన్లను అద్దెకు ఇవ్వనున్నారు. 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో ఎంపిక చేసిన 15 వేల గ్రూపులకు డ్రోన్లు అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
ఉత్తరాఖండ్ లోని టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం అహర్నిశలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారంతా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారి క్షేమం కోసం ప్రధాని మోడీ సైతం పాటుపడుతున్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం ప్రశంసనీయం. ప్రధాని చొరవ అందరికి ఎంతో స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.