Ramana Dikshitulu : కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి : రమణదీక్షితులు

Ramana Dikshitulu
Ramana Dikshitulu : గత ప్రభుత్వ హయాంలో తనపై పెట్టిన కేసుల నుంచి విముక్తి కల్పించాలని ఏపీ నూతన ప్రభుత్వాన్ని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆదివారం ఎక్స్ లో కోరారు. గత ప్రభుత్వ హయాంలో కొందరిపై పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించనున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.
గత టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనపై పెట్టిన అక్రమ కేసులతో తాను న్యాయస్థానాల చుట్టూ ఐదేళ్లుగా తిరుగుతున్నానని ఆవుదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనపై పెట్టిన కేసుల నుంచి నూతన ప్రభుత్వం ఉపశమనం కల్పించి, శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం తనకు కల్పించాలని విన్నవించారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆ ఎక్స్ లో పేర్కొన్నారు.