Free gas cylinder : ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను ఆయన సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు.
ఏడాదిలో మూడు దశల్లో గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 1.25 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారని, అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఒకసారి, ఆగస్టు 2 నుంచి నవంబరు 30 వరకు మరొకసారి, డిసెంబరు 1 నుంచి మార్చి 31 వరకు మూడో దఫా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ తెలిపారు.