Free Gas booking : ఏపీలో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ ప్రారంభమైంది. ప్రతి నాలుగు నెలలకొక సిలిండర్ చొప్పున ఏటా మూడు సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుకు రూ.851 రాయితీ రానుంది. వినియోగదారుడు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది.
ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లను పొందవచ్చు. అక్టోబరు 31 నుంచి మార్చి నెలాఖరులోకా ఒక సిలిండర్.. అలాగే 2025 ఏప్రిల్ 1 నుంచి జులై వరకు రెండో సిలిండర్.. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా అందించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.